calender_icon.png 26 April, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని ప్రజలు, వ్యాపారులు సైబర్ నేరగాల్ల ఉచ్చులో పడవద్దు

25-04-2025 05:44:02 PM

మున్సిపల్ కమిషనర్ మనోహర్..

మంథని (విజయక్రాంతి): మంథని మున్సిపాలిటి పరిధిలోని ప్రజలు, వివిధ దుకాణ వ్యాపారస్తులు సైబర్ నేరాగాళ్ల ఉచ్చులో పడవద్దని మున్సిపల్ కమిషనర్ మనోహర్(Municipal Commissioner Manohar) ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎవరైనా ఫోన్ చేసి దుకాణ వివరములు చెప్పాలని, మున్సిపల్ కార్యాలయము నుండి మాట్లాడుతున్నమని, ట్రేడ్ లైసెన్స్ డబ్బులు ఫోన్ పే లేదా జీపీఏ ద్వారా చెల్లించాలని లేక పొతే మీ దుకాణములుకు ఫైన్ వేసి సీజ్ చేయ బడుతాయని, బెదిరించి డబ్బులు వసూల్లకు పలుపడుతున్నారని, ఇప్పటి వరకు మంథని మున్సిపల్ పరధిలో అనేక దుకాణదారులకు పలు ఫ్రాడ్ ఫోన్ కాల్స్ వచ్చాయని, కావున పట్టణంలోని ప్రజలు నేరుగా మంథని మున్సిపల్ ఆఫీస్ కి వచ్చి పన్నులు చెల్లించి సైబర్ నేరగాల్ల ఉచ్చులో పడకుండా జాగ్రతగా ఉండాలని కోరారు. సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకి సమాచారం అందించాలని కమీషనర్ కోరారు.