డీజే ఓనర్లకు మంథని ఎస్ఐ రమేష్ హెచ్చరిక
మంథని (విజయక్రాంతి): డీజేలతో మంథని ప్రజలను ఇబ్బందులు పెడితే, కేసులు నమోదు చేస్తామని, డీజే ఓనర్లకు మంథని ఎస్ఐ రమేష్ హెచ్చరించారు. బుధవారం ఉదయం మంథని పోలీస్ స్టేషన్లలో పట్టణంలోని డీజే ఓనర్లను పిలిచి వారికి కౌన్సిలింగ్ చేశారు. సిపి, ఏసిపి ఆదేశాల మేరకు మంథని మండలంలో వినాయకుని నిమజ్జనం సందర్భంగా ఎలాంటి డీజేలకు పర్మిషన్ ఇవ్వలేదని, ఎవరైనా డీజేలు పెడితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.