ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
పెద్దపల్లి, అక్టోబర్ 15 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని ఆర్డీవో హనుమానాయక్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డీవో హనుమానాయక్ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ విషయంలో సింగరేణి భూ నిర్వాసితుల విషయంలో నిర్లక్ష్యం వహించారు.
అలాగే తన వాహనానికి సంబంధి ంచి ప్రభుత్వ సొమ్మును వాడుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఆర్డీవో గత కొన్ని నెలలుగా ధరణి ఆపరేటర్‌ను ఏర్పాటు చేసుకుని రామగిరి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. ఈ పరిణామాలపై స్పందించిన కలెక్టర్.. ఆర్డీవోను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశా రు.
కాగా మంథని ఇన్‌చార్చి ఆర్డీవోగా పెద్దప ల్లి ఆర్డీవో గంగయ్యను నియమించారు. కాగా గత 25 రోజులు క్రితం మంథని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామిని సరెండర్ చేసిన కలెక్టర్ నెల రోజులు గడవక ముందే ఆర్డీను సరెండర్ చేయడంతో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. ఈ ఘటనతో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని తప్పవని ఆర్డీవో సరెండర్‌తో కలెక్టర్ మరోసారి హెచ్చరించినట్లు కనిపిస్తున్నది.