calender_icon.png 21 September, 2024 | 7:53 PM

అజ్ఞాతంలో.... 'ఇనుముల'...

21-09-2024 05:31:21 PM

 అరెస్టుకు పోలీసుల స్పెషల్ ఆపరేషన్...

తాజాగా మంథని ఠాణాలో నాలుగో కేసు నమోదు...

బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా స్టేషన్ కు రావాలంటూ మంథని సీఐ రాజు పిలుపు...

మంథని(విజయక్రాంతి): మంథనిలో (వసూల్ రాజా), మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సత్యనారాయణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అతని సెటిల్మెంట్ ల దందాలు రోజుకొకటి వెలుగు చూస్తుండగా.... అరెస్టు చేసేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ ద్వారా రంగంలోకి దిగారు. ఇప్పటికే అతని అనుచరుడుని అరెస్టుచేయగా.. ఇనుముల ఆచూకీ కోసం బృందాలుగా వీడి  గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. తాజాగా మంథని పోలీస్ స్టేషన్  లో శనివారం నాలుగో కేసు నమోదు చేశారు.

అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇనుముల సత్యనారాయణ  అలియాస్  సతీష్ పై శనివారం పిర్యాదు రాగ అతనిపై కేసు నమోదు చేసినట్లు మంథని సీఐ రాజు తెలిపారు. ఆయన కథనం ప్రకారం మంథని మండలం నాగారం గ్రామం, ప్రస్తుతం మంథని లో ఉంటున్న బెల్లంకొండ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి కాంట్రాక్టు వర్క్ చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి  2024 మే నెలలో  5 కాంట్రాక్టు పనులు రాగా  మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని చేస్తుండగా 21తేదీన ఇనుముల జోక్యం చేసుకొని  నీకు బాగా కాంట్రాక్టులు వచ్చాయని, నాకు రూ.2 లక్షల రూపాయలు ఇవ్వాలని లేకపోతే నీ కాంట్రాక్టు బిల్లులు రాకుండా చేస్తానని, గతంలో కూడా నేను కాంట్రాక్టు బిల్లులు రాకుండా, ఇల్లు నిర్మాణాల గురించి కోర్టులో పిల్ వేసి నిలిపివేశానని,  కూల్చి వేయించినానని పలుసార్లు బెదిరించగా, ఫిర్యాదారుడు అతనికి భయపడి 28-8-2024 తేదిన అతని  స్నేహితునితో యుక్తంగా బిఎస్ ఫంక్షన్ దగ్గర గల మెయిన్ రోడ్డు వద్ద అతనికి ఒక లక్ష రూపాయలు ముట్ట చెప్పాడని, కానీ ఇనుముల  మిగతా లక్ష రూపాయలు ఇవ్వమని లేకపోతే ఆస్తి, ప్రాణ నష్టం కలిగిస్తానని పలుసార్లు ఫిర్యాదిని బెదిరించినాడని ఇన్ని రోజులు ఫిర్యాదారుడు అతనికి భయపడి దరఖాస్తు ఇవ్వలేదని, ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 

మంథని ప్రజలు, వ్యాపారస్తులు గాని, కాంట్రాక్టర్స్ గాని, రియల్టర్స్ గాని,  ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే ఇనుముల కు భయపడకుండా నిర్భయంగా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయాలని, ఇప్పటివరకు  ఇనుముల సతీష్ పై మంథని పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు, రామగిరి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు మొత్తం నాలుగు కేసులు నమోదు అయినట్లు తెలిపారు. పై మూడు కేసులలో ఇనుముల సతీష్ కు సహకరించిన రావికంటి సతీష్ ను అరెస్టు చేసి జైలుకు పంపించామని. త్వరలోనే  ఇనుముల సతీష్ ను కూడా అరెస్టు చేయనున్నట్లు సీఐ స్పష్టం చేశారు. బాధితులు ఎవరు కూడా భయపడవద్దని పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుందని సీఐ బాధితులకు హామీ ఇచ్చారు.