calender_icon.png 1 November, 2024 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య సంరక్షణ కోసం వ్యాయామాలు తప్పనిసరి

07-07-2024 03:46:45 PM

మంథని: నేటి రోజుల్లో ఆరోగ్య సంరక్షణ కోసం వ్యాయామాలు తప్పనిసరని మంథని ఓపెన్ జిమ్, మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సన్మానంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాసురేష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం మున్సిపల్ చైర్మన్ రమ సురేష్ రెడ్డితో పాటు వైస్ చైర్మన్ ను సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ... ఓపెన్ జిమ్ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఉంటాయని, ఇప్పటికే చిల్డ్రన్ పార్క్ లో టాయిలెట్స్ మరియు వాకింగ్ ట్రాక్ కు సంబంధించి ప్రతిపాదనలు చేశామన్నారు. వీటిని పూర్తిచేసి ప్రారంభించి మార్నింగ్ వాకర్స్ కి అందుబాటులోకి తెస్తామని, మంత్రి  శ్రీధర్ బాబు  సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. 

ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంథని ఓపెన్ జిమ్ కు వచ్చారు. వరంగల్ యూనిట్ లో భాగంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ ను కరీంనగర్ యూనిట్ గా విస్తరించుకోవడం కోసం అందులో సభ్యులుగా చేరడానికి మంథని ఓపెన్ జిమ్ అండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీపతి బాణయ్య, స్థానిక కౌన్సిలర్లు చొప్పకట్ల హనుమంతు, వికే రవి లతోపాటు ఓపెన్ జిమ్ అసోసియేషన్ అధ్యక్షుడు కూర కోటేష్,  ప్రధాన కార్యదర్శి జనగామ రమణారావు, సీనియర్ సభ్యులు ఉష, కొమరోజు శ్రీనివాస్, వొల్లాల శంకర్ లింగం, ఎక్కేటి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.