calender_icon.png 21 January, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్ట మధు నీలా దోపిడి పనులు.. అందరూ చేస్తారనుకోవడం నీ అవివేకం

17-07-2024 04:45:38 PM

మంథని: పుట్ట మీరు మంథనిలో చేసిన దోపిడి పనులే అందరూ చేస్తారనుకోవడం నీ అవివేకమని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి అన్నారు. బుధవారం మంథని లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ... మీరు గతంలో చేసిన దోపిడీల ను ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు కొనసాగిస్తున్నారని అనుకోవడం పుట్ట మధు అవివేకానికి నిదర్శనమన్నారు. మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించి పుట్ట విలేకరుల సమావేశంలో మాట్లాడారని ఆమె తప్పుపట్టారు.

తాము స్థానికులం కాదంటూ పుట్ట మధు చేసిన ఆరోపణలు సైతం తీవ్రంగా ఖండిస్తున్నామని తాము పుట్టి పెరిగిన, చదువుకున్న ప్రాంతం మంథని అని, మా స్థానికత విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే పుట్ట మధు నీ భార్య పుట్ట శైలజని అడిగి తెలుసుకో అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య తో పాటు స్థానిక కౌన్సిలర్లు చొప్పకట్ల హనుమంతు, వి కే రవి, గుండా విజయలక్ష్మి పాపారావు, నక్క నాగేంద్ర శంకర్, కొట్టే పద్మా రమేష్, వేముల లక్ష్మి సమ్మయ్య తోపాటు తదితరులు పాల్గొన్నారు.