calender_icon.png 8 January, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని నడిబొడ్డున.. దర్జాగా మెయిన్ రోడ్డు కబ్జా...

06-01-2025 01:56:42 PM

చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు

ప్రయాణికుల నుంచి వెళ్ళవెత్తుతున్న విమర్శలు..

మంథని (విజయక్రాంతి): మంథని నడిబొడ్డున... మెయిన్ రోడ్డును దర్జాగా కబ్జా చేస్తున్నారు. నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు... అన్న చందంగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రధాన రోడ్డు ఆక్రమణకు గురవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంథని బస్టాండ్ సమీపంలోనే ప్రధాన రహదారిపై పండ్ల వ్యాపారులు రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటే ఆర్టీసి బస్సులకు, లారీలకు, కార్లు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగంగా ప్రధాన రహదారిని ఆక్రమించుకున్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని మున్సిపల్ అధికారులపై ప్రయాణికులు, పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇదేవిధంగా చోద్యం చూస్తే మునుముందు ప్రధాన రోడ్డు మరింత కబ్జాకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకొని రోడ్డు ఆక్రమణకు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.