- ప్రధాన చౌరస్తాలోనే ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
- అంబేద్కర్ చౌక్‌లో సైడ్ డ్రైన్‌లో యూరియా లోడుతో దిగబడ్డ లారీ నిదర్శనం
- రోడ్లు వెడల్పు చేసి కష్టాలు తీర్చాలని కోరుతున్న ప్రజలు
మంథని, జనవరి 19 విజయక్రాంతి): మంథని పట్టణం ఇరుకు రోడ్లతో ప్రమాదక రంగా తయారైంది. ప్రధాన చౌరస్తాలోనే ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు పడుతు న్నారు. ప్రయాణికులు, ప్రజలు... అంబేద్కర్ చౌక్ లో శనివారం సైడ్ డ్రైన్‌లో యూరియా లోడుతో వచ్చిన లారీ దిగబడడమే నిదర్శనమని ప్రజలు చర్చించుకుంటు న్నారు.
ఇరుకు రోడ్లతో ఎన్నో ఏళ్లుగా మంథ ని ప్రధాన రహదారి అయిన పాత పెట్రోల్ బంక్ నుండి బస్సు డిపో వరకు రోడ్లు వెడ ల్పుగా లేకపోవడమే కారణం... పట్టణంలోని, శ్రీ పా ద చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, కూరగాయల మార్కెట్ చౌరస్తా, బాబు జగ్జీవన్ విగ్రహం చుట్టుపక్కలకు వెళ్లే గల్లీలు, నడివీధికి, అయ్య ప్ప స్వామి దేవాలయం వద్దకు, పెంజరుకట్ట, చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్‌కు, ఆర్డిఓ కార్యా లయం వరకు రోడ్లన్నీ ఇరుగుగా ఉండడంతో మంథని పట్టణంలో ప్రయాణికులు, ప్రజల కష్టాలు తీర్చాలని ప్రజలు, ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.
మంథని అంబే ద్కర్ చౌరస్తాలో ఎరువుల బస్తాల లారీ ప్రమా దానికి గ్రికావడంతో ప్రమాదాలు ముందు ముందు ఇంకా పొంచి ఉన్నాయని తెలుస్తుం ది. మంథని నడి ఒడ్డున గల అంబేద్కర్ చౌర స్తాలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుం దని, అదష్టవశాత్తు ప్రాణ నష్టం జరగపోవ టంతో ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకు న్నారు.
పట్టపగలు భారీ వాహనాలను పట్టణం లోపలికి రావడంతో ఫెర్టిలైజర్ షాప్ యజ మానులు గోదాములను పట్టణం బయట ఏర్పాటు చేసుకోవాలని ప్రజలు ఇప్పటి నుంచి కోరుతున్నారు. గతంలో నాలా పైకప్పు నిర్మాణాలను నాసిరకంగా చేపట్టడం వల్ల పైకప్పు నిర్మాణాలు కూలడంతో లారీ టైర్లు డ్రైనేజీలో ఇరుక్కుపోయాయని, దీంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మున్సిప ల్ అధికారులు, పోలీస్ యంత్రాంగం కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.