- పట్టించుకోని మున్సిపల్ అధికారులు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణవాసులు
మంథని, అక్టోబర్ 29 (విజయక్రాంతి): పేదవాడు ఖాళీ స్థలంలో చిన్న రేకుల షెడ్డు వేసుకుంటే ఆగమేఘాల మీద వచ్చి బుల్డోజర్లతో కుప్ప కూల్చే యంత్రాంగం మంథని లో పుట్టగొడుగుల్లా అక్రమ కట్టడాలు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదు.
ఆర్థిక, రాజ కీయ బలాలను వినియోగించుకుని కొంద రు అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో కట్టడాలు నిర్మిస్తున్నా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి ఇటీవల పోలీసుల సాయంతో కొన్ని అక్రమ కట్టడాలను పాక్షికంగా కూల్చివేశారు.
దీంతో కట్టడాలు నిర్మించిన వారు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మున్సిపల్ కమిషనర్‌ను కలెక్టర్ సరెండర్ చేయడంతో ఆయన స్థానంలో కొత్త కమిషనర్‌గా ఎవ రూ బాధ్యతలు స్వీకరించలేదు. ప్రస్తుతం ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్‌గా ఓ అధికా రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, మరోవైపు అక్రమార్కులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు. నిర్మాణాలపై ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ మనోహర్‌రెడ్డిని కోర గా.. ‘అక్రమంగా కట్టడాలు నిర్మించిన వారికి త్వరలోనే నోటీసులు ఇస్తా’మని ఆయన సమాధానమిచ్చారు.