- మంత్రపురి ఒడిలో తొలి సాఫ్ట్‌వేర్ కంపెనీ
- గ్రామీణ నిరుద్యోగ యువత భవితకు భరోసా
- ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు
మంథని,సెప్టెంబర్14(విజయక్రాంతి): అటవీప్రాంతంలో పారిశ్రామిక ప్రగతి పురుడు పోసుకుంది. మంత్రపురి ఒడిలోకి తొలి సాఫ్ట్‌వేర్ కంపెనీ వచ్చింది. మంథనికి సాఫ్ట్‌వేర్ కంపెనీ తీసుకవస్తానని శపథం చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నట్టుగానే సాఫ్ట్‌వేర్ కంపెనీ తీసుకవచ్చారు. ఈమేరకు శనివారం మంథనిలో సెంటిలియన్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులకు ఆయన కృతజతలు తెలిపారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు స్థానిక యువత తమ తల్లిదండ్రుల కళ్లెదుట ఉన్నత ఉద్యోగాలు చేయడం చూడాలన్నదే తన తపన అని చెప్పారు.
సాఫ్ట్‌వేర్ కంపెనీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంథని ప్రాంత మేధస్సుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తిం పు ఉందని అన్నారు. ఇక్కడ పరిశ్రమల స్థాపనకు వచ్చే ఔత్సాహికులకు తనవంతుగా ప్రోత్సాహం అందిస్తానని ప్రకటించారు. మంథని ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్ గా మార్చేందుకు కృషిచేస్తానని పేర్కొన్నారు. అనంతరం పలువురికి నియామక పత్రాలు అందజేశారు. ఈ ప్రాంత ప్రజలను ఎవరైనా భయపెడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్ రాధాకిషన్, సుధాకర్, గణేశ్, రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ రమాదేవి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.