calender_icon.png 31 October, 2024 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలల్లో నీరు నిల్వ ఉండకుండా గ్రౌండ్ లెవెలింగ్ చేపట్టాలి

31-07-2024 03:59:17 PM

మంథని మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

మంథని(విజయక్రాంతి): వర్షాకాలం నేపథ్యంలో పాఠశాల మైదానాలలో నీరు నిలువ ఉండకుండా గ్రౌండ్ లెవెలింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ మంథని మండలం ఖాన్ సాయి పేట గ్రామంలోని పాఠశాల,  ఆరెంద గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అడవి సోమనపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, వెంకటాపూర్ గ్రామంలోని జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాల లను తనిఖీ చేశారు. పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను, పాఠశాలలోని టాయిలెట్లు, భోజన శాల, కిచెన్ ఏరియా ను, పాఠశాలలోని తరగతి గదులను తనిఖీ చేసి  ప్రాథమిక తరగతుల విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలను పరీక్షించారు.

విద్యార్థుల కనీస విద్యాప్రమాణాలపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని, పిల్లలకు తప్పనిసరిగా చదవడం, రాయడం, బేసిక్ మ్యాథ్స్  రావాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో పాఠశాల మైదానాలలో నీరు నిలువ ఉండకుండా గ్రౌండ్ లెవెలింగ్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. అడవి సోమనపల్లి పాఠశాలలో కాంపౌండ్ వాల్ గెట్ ఏర్పాటు చేయాలని, కోతుల సమస్య నివారణ కోసం వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆరెంజ్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల సమీపంలో కూలిపోయే స్థితిలో ఉన్న పాత ప్రాథమిక పాఠశాల భవనాన్ని పూర్తి స్థాయిలో తొలగించాలని  సూచించారు. ఆయన వెంట మంథని ఎంపీడీవో పూర్ణచందర్ రావు ,పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ కె నవీన్, అసిస్టెంట్ ఇంజనీర్ అనుదీప్  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.