calender_icon.png 16 January, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టమధు వ్యాఖ్యలపై మండిపడ్డ మంథని కాంగ్రెస్ నాయకులు

06-07-2024 03:01:19 PM

మంథని,(విజయక్రాంతి): మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధు వ్యాఖ్యలపై మంథని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొండ శంకర్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ జి శుక్రవారం మంథనిలో ప్రెస్ మీట్ లో  మాట్లాడుతూ... ఓడేడు బ్రిడ్జి కులడానికి కారణం గత బీఆర్ఎస్  ప్రభుత్వమేనని, పుట్ట మధు అవినీతి, కమీషన్ల  కక్కుర్తి అన్నారు. ఓడేడు మానేరు నది పై అప్పటి ప్రభుత్వంలోని పెద్దపల్లి జిల్లా జడ్పి చైర్మన్ గా ఉన్న పుట్ట మధు, బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టర్ల దగ్గర నుండి అధిక మొత్తంలో కమీషన్లు తీసుకొని బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత లేకుండా నిర్మించడం వల్ల పలుమార్లు బ్రిడ్జి గాడార్లు, పిల్లలర్లు కూలీ పోయాయన్నారు.

అప్పుడు మా నాయకుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అవినీతిపై ప్రశ్నిస్తే  మీ ప్రభుత్వంలో ప్రతీపక్షలను అణిచివేశారని, నాణ్యత లేకుండా సోప్ప బెండుల నిర్మించిన బ్రిడ్జికి పుట్ట మధు పూర్తి బాధ్యత వహించాలన్నారు. దొంగే దొంగ అన్నట్లు ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబుపై, శ్రీనుబాబు పై అవకులు చేవకులు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు తగిన బుద్ది చెప్పడం జరుగుతుందన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ కూడా మరకుండా మధు మాతిభ్రమించినట్లు ప్రవర్తిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని  రాకేష్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి ఎరుకల సురేష్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ఆర్ల నారాయణ,  బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పర్శవేణ మోహన్, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి మంథని సురేష్ నాయకులు పెరవేన లింగయ్య, తోకల మల్లేష్, అక్కపాక సదయ్య, మంథని సమ్మయ్య, కందుకూరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.