calender_icon.png 25 December, 2024 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసాంఘిక చర్యలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు

02-08-2024 11:44:49 AM

బేగంపేట లో కార్డన్ సెర్చ్ లో మంథని సీఐ రాజు గౌడ్

మంథని,(విజయక్రాంతి): గ్రామంలో అసాంఘిక చర్యలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని మంథని సీఐ రాజు గౌడ్ హెచ్చరించారు. రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో శుక్రవారం రామగిరి ఎస్సై సందీప్ కుమార్, ముత్తారం ఎస్సై మధుసూదన్  ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి సీఐ గ్రామంలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సరైన పత్రాలు లేని బైక్ లను గుర్తించి వాటిపైన చాలాన్లు వేశారు.

యువత గంజాయి, మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించారు. గంజాయి, మత్తు పదార్థాలు ఎవరైనా సేవించిన విక్రయించిన, మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చిన నేరమని,  అంతేకాకుండా సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోవాలని, మీకు తెలియని ఏదైనా ఫోన్ నెంబర్ నుండి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చి మిమ్మల్ని ఏవైనా ప్రలోభాలకు గురి చేసిన వెంటనే మీరు 1930 నెంబర్ కు కాల్ చేయలన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవరైనా అనుచిత పోస్టులు పెట్టవద్దని, మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల మర్యాదగా నడుచుకోవలన్నారు. ఎలాంటి విషయం తెలిసిన తక్షణమే 100 నెంబర్ కు కాల్ చేయాలని గ్రామ ప్రజలకు సీఐ సూచించారు.