calender_icon.png 14 March, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు రోడ్డు సేఫ్టీ, సైబర్ క్రైమ్స్, మాదక ద్రవ్యాల కెమెరాలపై అవగాహన

13-03-2025 10:22:59 PM

గుంజపడగు అవగాహన సదస్సులో మంథని సిఐ రాజు

మంథని,(విజయక్రాంతి): ప్రజలు రోడ్డు సేఫ్టీ, సైబర్ క్రైమ్స్, మాదక ద్రవ్యాల కెమెరాలపై  అవగాహన కల్గి ఉండాలని గుంజపడగు అవగాహన సదస్సులో మంథని సిఐ రాజు పేర్కొన్నారు. మంథని ఎస్ఐ  రమేష్  ఆధ్వర్యంలో గుంజపడుగు గ్రామంలో  ప్రజలకు  డయల్ 100, రోడ్డు సేఫ్టీ, సైబర్ క్రైమ్స్, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే నష్టాలు సీసీ కెమెరాల ఉపయోగాలుపై అవగాహన కార్యక్రమము సీఐ నిర్వహించారు. ఈ  సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామం లో ఉన్న శాంతి భద్రతల గురించి తెలుసుకొని మాట్లాడుతూ ప్రజలకు అత్యవసర సమయం లో పోలీస్ సహాయం పొందాలని భావించినప్పుడు డయల్ 100 కు కాల్ చేయలని, దగ్గరలో ఉన్న బ్లూ కొల్ట్స్ సిబ్బంది నిమిషాల వ్యవధిలోని  వచ్చి తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. వాహన దారులు తప్పని సరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలి. చిన్న చిన్న రోడ్డు సేఫ్టీ నియమాలు పాటించకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ నంబరు ప్లేట్, మైనర్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930కు సమచారం అందించి నేషనల్ క్రైమ్ బ్రాంచ్ కులో ఫిర్యాదు చెయ్యాలని,  సోషల్ మీడియా (ఫేస్ బుక్, ఇన్స్టాగ్రం) ద్వారా అడ్వటేజ్మెం ఏవైనా తక్కువ రేట్లకు వస్తయంటే నమ్మి మోసపోవద్దని,  ఎవరైనా గంజా, ఇతర మాదక ద్రవ్యాలు వాడుతున్న, సరపరా చేస్తున్నట్లు గుర్తించిన పోలీస్ వారికి సమచారం అందించాలన్నారు.