calender_icon.png 28 December, 2024 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఆర్యభట్ట గణిత చాలెంజ్’లో ‘మంతన్’ విద్యార్థి ప్రతిభ

28-12-2024 01:43:32 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27 (విజయక్రాంతి): జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆర్యభట్ట గణిత చాలెంజ్ పోటీలో ఆరవ్ ప్రతిభ చాటాడు. హైదరాబాద్‌లోని మంతన్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ఆరవ్ ఈ పోటీలో మొదటి, రెండో దశలను విజయవంతంగా పూర్తి చేసి సీబీఎస్‌ఈ విజయవాడ ప్రాంతం నుంచి టాప్ 100 విద్యార్థులలో ఒకడిగా నిలిచాడని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ సుర్జీత్‌సింగ్ శుక్రవారం తెలిపారు.

ఆరవ్ విజయ సాధన తమ స్కూల్ విద్యా విలువలను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంకిత భావం, మార్గదర్శకం, మద్దతు కలిగిన విద్యా వాతావరణం జాతీయస్థాయిలో ఎలా విజయం సాధించగలమని ఈ విజయంతో మరోసారి రుజువైందన్నారు. ఆర్యభట్ట గణిత చాలెంజ్ అనేది దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో గణిత నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేందుకు రూపొందించిన ప్రతిష్టాత్మక వేదిక అని సుర్జీత్‌సింగ్ వివరించారు.

ఈ సందర్భంగా ఆరవ్ మాట్లాడుతూ.. తన విజయానికి పాఠశాల ప్రధాన కారణమన్నాడు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్, స్నేహితుల మద్దతు లేకుండా ఈ ఘనత సాధ్యమయ్యేది కాదని తెలిపాడు. ముఖ్యంగా కపిల్ సార్‌కు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.

మంతన్ స్కూల్ గణిత సబ్జెక్ట్ లీడ్ ప్రియాంకసేన్ మాట్లాడుతూ.. జాతీయస్థాయి పోటీలు, విద్యార్థుల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన, గణితంపై ఆసక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. మంతన్ స్కూల్ సమాచారం కోసం 9959154371/ 9963980259 లేదా www.manthanschool.org వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.