కోరుట్ల, డిసెంబర్ 25 (విజయ క్రాంతి) : కోరుట్ల పట్టణానికి చెందిన తెలుగు టీచర్, ప్రముఖ కవి, కథా రచయిత కటుకోజ్వల మనోహరాచారి ‘అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు వరంగల్’ వారి ప్రథమ నవలా పురస్కారం అందుకున్నారు. మనోహరాచా రి రాసిన అనామకుడు నవలను ఈ పుర స్కారానికి ఎంపిక చేస్తూ వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో కటుకోజ్వల మనో హరాచారికి విఖ్యాత రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నగదు బహుమతి, మెమోంటో, ప్రశంసా పత్రంతో అవార్డు ప్రధానం చేశారు. పురస్కారం అందుకున్న మనోహ రాచారిని సాహితీ వేత్తలు, ఉపాధ్యా యులు అభినందించారు.