09-04-2025 12:40:12 PM
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూములకు(Kancha Gachibowli lands) సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేశారంటూ ఆయనకు గచ్చిబౌలి పోలీసులు ఈ నెల 9, 10, 11 తేదీల్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం మన్నె క్రీశాంక్, కొంతం దిలీప్ కుమార్ లు గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో హాజరయ్యారు.ఉదయం 11:30 గంటలకు పోలీసుల ఎదుట హాజరయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి విచారణ సాగుతోంది.