ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): దేశ గతిని, గమ్యాన్ని మార్చిన నేత మన్మోహన్‌సింగ్ అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. అసెంబ్లీలో సంతాప తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. మన్మోహన్‌సింగ్ నిజాయితీకి నిలువుటద్దమ న్నారు. యూపీఐ1లో కమ్యూ నిస్టులు కూడా మన్మోహన్‌సింగ్‌కు సహకరించినట్టు చెప్పారు.
ఈ సందర్భంగా పీవీ, మన్మోహన్‌సింగ్ జోడీని కూనంనేని ప్రస్తావించారు. ఒక మేధావిని మరొక మేధావి మాత్రమే అర్థం చేసుకుంటారన్నడానికి వీరిద్దరే నిదర్శ నమన్నారు. పీవీ కేసుల్లో ఉన్నప్పుడు మన్మోహన్ అండగా నిలిచారన్నారు. మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలపై కూనంనేని అభ్యంతరం తెలిపారు. వ్యక్తిగత అంశాలను సంతాప సభలో ప్రస్తావించి.. రాజకీయ వేదికగా మార్చడం విజ్ఞత కాదన్నారు. ఇలా చేస్తే మన్మోహన్‌సింగ్ ఆత్మ క్షోభిస్తుందన్నారు.