ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి
కరీంనగర్/జగిత్యాల/పెద్దపల్లి/సిరిసిల్లడిసెంబరు 27 (విజయక్రాంతి) : నష్టాలతో అస్తవ్యస్తంగా ఉన్న ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆర్థికరంగాన్ని సుస్థిరపరిచిన మేధావి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ర్టం ఏర్పడిందని కాంగ్రెస్ నేతలు ఉద్ఘాటించారు.
ఆయన మరణం పట్ల కరీంనగర్ పార్టీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి పూలమాల లు సమర్పించి నివాళులర్పించారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, భారతదేశానికి తీరని లోటని తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంతోపాటు తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ నాయకులు మన్మోహన్సింగ్కు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, ఎండీతాజ్, వైద్యుల అంజన్ కుమార్, పులి ఆంజనేయులుగౌడ్, కర్ర సత్యప్రసన్న రెడ్డి, అహ్మద్ అలీ, ముస్తాక్ అహ్మద్, వెన్న రాజమల్లయ్య, నిహాల్ అహ్మద్, ఉండాటి శ్రీనివాస్ రెడ్డి, దన్ను సింగ్, కల్వల రాంచందర్, విద్యాసాగర్, నాగుల సతీష్, రామిడి రాజిరెడ్డి, బొబ్బిలి విక్టర్, సిరిపురం ప్రసాదోపాటు నాయ కులు, కార్యకర్తలు నివాళులర్పించారు.
అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో మాజీ ప్రధాని మన్మోహన్సంగ్కు ఘన నివాళులర్పించారు. విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి కొత్తపల్లిలోని ఈటెక్నో పాఠశాలలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించారు. నగర మేయర్ వై సునీల్రావు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేంద ర్రావు వేర్వేరుగా మన్మోహన్సింగ్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.
హుజూ రాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడికెల ప్రణవ్ మన్మోహన్ సింగ్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటులో ఆయన చేసిన కృషి రాష్ర్ట ప్రజల మదిలో ఉంటుందని అన్నా రు. సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేం దర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపెల్లి రాజు లు మన్మోహన్సింగ్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. జీడీపీ వృద్ధిలో భారత దేశానికి దిక్సూచిగా నిలిచిన వ్యక్తి మన్మో హన్ సింగ్ అని కొనియాడారు.
జగిత్యాల జిల్లాలో..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మర ణం దేశానికి తీరని లోటని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కథలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన సంస్కరణ సభలో పాల్గొని నివాళులర్పిం చారు.
దేశాన్ని తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టనించిన మేధాని మన్మోహన్సింగ్ అని కొనియాడారు. ఆయన మయాలలో 70 వేల కోట్ల పైచిలుకు రైతులకు రుణమా ఫీ చేశారని కొనియాడారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సంస్కరణ సభలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని నివాళులర్పిం చారు. భారతదేశ ఆర్థిక సంస్కరణలకు అద్యుడు మన్మోహనౌసింగ్ మృతి దేశానికి తీరని లోటన్నారు.
పెద్దపల్లి జిల్లాలో..
భారతదేశంలో ఆర్ధిక సంభంలో ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపె ట్టి దేశ ఆర్ధిక వృద్ధి రేటును పరుగులు పెట్టించిన మహోన్నతి వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని పెద్దపల్లి ఎమ్మెల్యేల చింతకుంట విజయరమణారావు అన్నారు.
ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో మన్మోహన్సింగ్ చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్‌కు రామగుం డం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నివాళుల ర్పించారు.
మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు అయిలు ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ హిందు రమాదేవి పాల్గొని నివాళులర్పించారు.
సిరిసిల్ల జిల్లాలో..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళుల ర్పించారు. వేములవాడ పట్టణ అధ్యక్షుడు చందనగిరి శ్రీనివాస్ గౌడ్ వేములవాడ బ్రిడ్జి వద్ద మన్మోహన్సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆర్ధిక మంత్రిగా పీవీ నరసింహరావు సారధ్యం లో, సోనియాగాంధీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రిగా భారతదేశాన్ని ఆర్ధికంగా పటిష్ట పరిచిన మేధావి మన్మోహన్ సింగ్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమి టీ, మున్సిపల్ చైర్మన్లు శనిగరపు రాజేష్, బింగి మహేశ్, కౌన్సిలర్ ఉప్పాపుల అజయ్, డైరెక్టర్ సాబీర్, నాయకులు చిలుక రమేశ్, కూరగాయల కొమురయ్య, పాత సత్య లక్ష్మి, అన్నారం శ్రీనివాస్, పీరు మహేం దర్, కొక్కుల బాలకృష్ణ, అబ్దుల్ రజాక్, ముప్పిడి శ్రీధర్, పుల్కం రాజు, కోయలా ్కర్ మస్తాన్, నాగుల మహేశ్, దూలం భూమేష్, పోలాడి రాజేశం, అడగట్ల అనిత, వెంకన్న, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.