న్యూడిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు(Manmohan Funeral) నిర్వహించారు. మన్మోహన్ అంత్యక్రియల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi), భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్ చుక్ పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ కు త్రివిధ దళాధిపతులు, విదేశీ ప్రతినిధులు నివాళులర్పించారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి నిగమ్ బోధ్ ఘాట్ వరకు అంతిమయాత్ర సాగింది. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కేంద్రం నిర్వహిస్తోంది. మన్మోహన్ అంత్యక్రియల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi), రేవంత్ రెడ్డి, కేటీఆర్, సిద్ధరామయ్య, మల్లిఖర్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, కిరణ్ రిజిజు పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.