కొనసాగుతున్న మన్మోహన్ అంతిమయాత్ర
న్యూఢిల్లీ: కాసేపట్లో ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఏఐసీసీ కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర కొనసాగుతోంది. అంతిమయాత్రలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఢిల్లీ నిగమ్ బోధ్ ఘాట్ కు మన్మోహన్ సింగ్ పార్థివదేహం తరలించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో ఉదయం 11:45 గంటలకు ఈ వేడుక జరుగుతుందని హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.