మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ దూరదృష్టితోనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికశక్తిగా మారింది. 1990లో దేశంలో అమలులోకి వచ్చిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ పాత్ర దేశా ఆర్థిక చరిత్రను మలుపుతిప్పింది. ఆయకు విద్యారంగం, ఆర్థికశాస్త్రంపై మక్కువ. ఆయ న దేశానికి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని 1996లో ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్(డీ.లిఐటీటీ)తో సత్కరించింది. 1996లో జరిగిన ఓయూ స్నాతకోత్సవానికి కేంద్రమంత్రి హోదాలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులతో భవిష్యత్ దృక్కోణాలను పంచుకున్నారు.
కుమార్ మొలుగారం,
ఓయూ వీసీ