న్యూఢిల్లీ: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్(Manmohan Singh) అనేక ఉన్నత పదవులు సమర్థంగా నిర్వహించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Andhra Pradesh Chief Minister Chandrababu Naidu) అన్నారు. మన్మోహన్ సింగ్ దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరం అన్నారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని, ఉపాధి హామీ, ఆధార్, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారని ఆయన సేవలను స్మరించుకున్నారు.