calender_icon.png 9 January, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ల్యాండ్ మార్క్ ఘనత మన్మోహన్‌దే

31-12-2024 03:15:43 AM

  • విగ్రహ ఏర్పాటును స్వాగతిస్తున్నా
  • గ్రామీణ పేదల కోసం ‘ఉపాధిహామీ’ తెచ్చారు
  • ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  • హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): భూసేకరణ కోసం ల్యాండ్‌మార్క్ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కే దక్కుతుందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మానవీయ దృక్పథంతో అందరికీ న్యాయం జరిగేలా భూసేకరణ 2013 చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఆయనను భరతమాత ముద్దుబిడ్డగా అభివర్ణిం చారు.

  • అసెంబ్లీలో మన్మోహన్‌సింగ్ సంతా ప తీర్మానంపై మంత్రి మాట్లాడుతూ.. ఎన్నో ఉన్నత పదవులను మన్మోహన్ బాధ్యతాయుతంగా చేపట్టారని గుర్తుచేశారు. ఆయన విగ్రహ ఏర్పాటును తాను స్వాగతిస్తున్నట్టు మంత్రి చెప్పారు. అడవి బిడ్డలకు మేలు జరిగేలా అటవీ హక్కు చట్టాన్ని తీసుకొచ్చార న్నారు. దేశం క్షేమం కోసమే మన్మోహన్‌సింగ్ అమెరికాతో అణు ఒప్పందం చేసుకు న్నట్టు వివరించారు.

  • మన్మోహన్‌సింగ్‌తో తనకు అనుబంధం ఉన్నదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనను పలుమార్లు కలిసినట్టు.. తమ ఆహ్వానం మేరకు పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాల్లో వర్చువల్‌గా హాజరైన విషయాన్ని ఉత్తమ్ గుర్తు చేసుకున్నారు. దేశ రైతులందరికీ ఆ యన ఒకేసారి రుణమాఫీ చేశారన్నారు. మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో చారిత్రక చట్టాలను రూపొందించినట్టు వివరించారు.

  • గ్రా మాల్లోని పేదలకు ఉపాధి హామీ ఎంతో ఉపయోగపడిందన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు జవాబుదారీతనంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆర్‌టీఐని తీసుకొచ్చారన్నారు. ఆనాడు మన్మోహన్‌సింగ్ ప్రధానిగా లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడం కష్ట మయ్యేదన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో హైదరాబాద్‌ను ఏం చేయాలనే చర్చ జరిగిందని.. మన్మోహన్, సోనియా చొరవ వల్లే ఎలాంటి పరిమితులు లేకుండా భాగ్యనగరం రాష్ట్రానికి దక్కిందన్నారు.