calender_icon.png 27 December, 2024 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్మోహన్ విశిష్ఠ నేత

27-12-2024 02:08:01 AM

  • ప్రధాని మోదీ
  • సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రముఖులు

భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో మన్మోహన్ చేసిన కృషిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్తు చేసుకున్నారు. దేశంలోని అరుదైన రాజకీయ నాయకు ల్లో మన్మోహన్ ఒకరి పేర్కొన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత విశిష్ఠ నేతల్లో మన్మోహన్ ఒకరని ప్రధాని పేర్కొన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేసినట్టు తెలిపారు.

ఆర్బీఐ గవర్నర్‌గా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి సేవలందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ అన్నారు. ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. రాజకీయాల్లో మన్మోహన్ తనకు మార్గ దర్శిగా, గురువుగా నిలిచారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పారు.

మన్మోహన్ కుటుంబ సభ్యుల కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. దేశం ఓ రాజనీతిజ్ఞడిని కోల్పోయిందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అన్నారు.మన్మోహన్ మరణంతో దేశం ఒక లెజెండ్‌ను కోల్పోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అలాగే మన్మోహన్ మరణంపై  విదేశీ ప్రతినిధులు సంతాపం తెలియజేశారు. 

బెల్గాం నుంచి హుటాహుటిన..

మన్మోహన్ మరణ విషయం తెలియగానే కర్నాటకలోని బెల్గాంలో జరుగు తున్న సీడబ్ల్యూసీ సమావేశంలో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్‌గాం ధీ హుటాహుటిన ఢిల్లీకి వచ్చారు. ఎయి మ్స్ ఆసుపత్రిలో మన్మోహన్ భౌతికకాయాన్ని సందర్శించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. 

పీవీ కోరడంతోనే రాజకీయాల్లోకి 

పీవీ నరసింహారావు 1991 జూన్‌లో ప్రధానిగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. అయితే దేశం ఆర్థిక సంక్షోభంలో ఉండడంతో ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం  తన ప్రిన్సిపల్ సెక్రటరీని తన దగ్గరకు పీవీ పంపా రు. అపుడు జరిగిన ఘటనపై 2005లో బ్రిటిష్ జర్నలిస్ట్ మార్క్ టుల్లీతో మన్మోహన్ పంచుకున్నారు.“ ప్రధాని పీవీ.. తన క్యాబినెట్‌ను రూపొందిస్తున్న రోజున తన ప్రిన్సిపల్ సెక్రటరీని నా వద్దకు పంపాడు.

మీరు ఆర్థికమంత్రి అవ్వాలని ప్రధానమంత్రి పీవీ కోరుకుంటున్నారు అని చెప్పారు. అయితే ఆ విషయాన్ని నేనే సీరియస్‌గా తీసుకోలేదు. చివరికి నన్ను ఒప్పించి తన ట్రాక్‌లోకి తీసుకున్నాడు. ఉదయమే కోపంతో వచ్చి నేను దుస్తులు ధరించి ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్‌కు రావాలని డిమాండ్ చేశారు. అలా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది.”అని చెప్పుకొచ్చారు.