- పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
- ఓబీసీల సమస్యలకు కృషి చేశారు: వీహెచ్
హైదరాబాద్, డిసెంబర్ 26: మా జీ ప్రధాని మన్మోహన్ సింగ్ మర ణం దేశానికి తీరని లోటు అని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన భగవంతుణ్ణి ప్రార్థించారు. ఆర్థిక సం స్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన గొప్పనేత మన్మోహన్ సింగ్ అని కొనియాడా రు. మాజీ ప్రధాని మన్మో హన్ సింగ్ మృతి పట్ల పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు సంతాపం ప్రక టించారు. తాను రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఓబీసీల సమస్యలపై మ న్మోహన్‌కు వివరిస్తే సమస్య పరిషా ్కరానికి ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. మన్మోహన్ మృతిపై మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, తదితర మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు సంతాపం ప్రకటించారు.