బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు
హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని బీసీ కమిషన్ చైర్మ న్ జీ నిరంజన్ అన్నారు. శనివారం ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయంలో మన్మోహన్‌సింగ్ మృతి పట్ల చైర్మన్, సభ్యులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన్మోహన్‌సింగ్ చేసి న ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేశాయని కొనియాడారు.
ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక సలహాదారుగా, ఆర్థిక శాఖ మంత్రిగా దేశాన్ని ఆర్థిక స్థిరత్వం వైపు నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం, వారి హయాంలోనే స్వరాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేసుకున్నారు.
బీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో మన్మోహన్ పాత్ర మరువలేనిదన్నారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, స్పెషల్ ఆఫీసర్ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.