calender_icon.png 29 December, 2024 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్మోహన్ మృతి దేశానికి లోటు

29-12-2024 02:57:11 AM

టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (విజయక్రాంతి): మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి దేశానికి తీరనిలోటని, ఆయ న స్థానాన్ని భర్తీ చేయడం ఎవరివల్ల కాదని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేని (ముజీబ్) అన్నారు. ఆ సంఘం హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో శనివారం మన్మోహన్‌సింగ్‌కు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ.. నేడు భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది అంటే దానికి కారణం మన్మోహన్‌సింగ్ వేసిన పునాదులేనని స్పష్టంచేశారు. అనుక్షణం దేశం కోసం పరితపించిన దేశభక్తుడు మన్మోహన్ అని కొనియాడారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌కుమార్, సహాధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడు కుర్రాడి శ్రీనివాస్, సభ్యులు ఖాలెద్ అహ్మద్, వైదిక్ శస్త్ర, శ్రీధర్, ముఖీమ్ ఖురేషి, కేంద్ర సంఘం సభ్యులు శంకర్, ఉస్మానియా మెడికల్ కాలేజీ సభ్యులు ఎంఏ రహీం, ఎన్టీ అధ్యక్షులు రాజు, ఎక్సయిజ్ సభ్యులు కృష్ణ, గ్రంథాలయ సంస్థ సభ్యులు అయోధ్య, వరప్రసాద్, మహేందర్, సుఖేష్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సభ్యులు నజీర్, పీఆర్వో  జహంగీర్, ఏపీఆర్వోమహమ్మద్ వహీద్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.