calender_icon.png 26 October, 2024 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజులిక ద్వయం మజా డాన్స్

26-10-2024 12:00:00 AM

కార్తీక్ ఆర్యన్, త్రిప్తి డిమ్రీ నటించిన హిందీ చిత్రం ‘భూల్‌భులయ్యా3’ నుంచి ‘అమీ జే తోమర్ 3.0 పేరుతో మేకర్స్ శుక్రవారం ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాట పాట ప్రస్తుతం సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సమీర్ సాహిత్యం అందించిన ఈ గీతానికి అమల్ మల్లిక్ సంగీతం సమకూర్చగా, శ్రేయా ఘోషల్ పాడారు.

ఈ యుగళగీతంలో మాధురి దీక్షిత్, విద్యాబాలన్ నృత్య ప్రదర్శన ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. అయితే తొలి భాగంలో మంజులికగా విద్యాబాలన్ నటించగా, పార్ట్2లో ఆ పాత్రలో టబు కనిపించారు. మూడో భాగం విషయంలో మాత్రం ఒరిజినల్ మంజులికనే మళ్లీ బరిలోకి దింపారు మేకర్స్.

తొలి భాగంలో అందరినీ భయపెట్టిన విద్యాబాలన్ పార్ట్ 3లో మరోసారి మంజులిక పాత్రలో నటించారు. మాధురి దీక్షిత్ సైతం మరో మంజులికగా ఆకట్టుకోనుందని, ఈ రెండో మంజులిక ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెబుతోంది చిత్రబృందం.

అనీస్ బాజ్మీ దర్శకత్వంలో భూషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి తనిష్క్ బాగ్చి, సాచెత్- పరంపర, అమల్ మల్లిక్ తదితరులు సంగీతం అందించారు. సమీర్, రష్మీ విరాగ్, ఆదిత్య రిఖారీ, ధవ్ యోగి, సోమ్ గీత రచయితలుగా ఉన్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.