calender_icon.png 10 January, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా మాంజ వాడకం నిషేధం

03-01-2025 03:49:34 PM

రామగుండం,(విజయక్రాంతి): గోదావరిఖని సబ్ డివిజన్  పరిధిలో చైనా మాంజ(Chinese Mange)పై నిషేధం విధించామని, ఎవరైనా చైనా మాంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని గోదావరిఖని ఎసీపీ మడత రమేష్(Godavarikhani ACP Madatha Ramesh) ఒక ప్రకటనలో హెచ్చరించారు.  సంక్రాంతి సంద‌ర్భంగా చైనా మాంజ విక్ర‌యించే దుకాణాలపై అధికారులు తనిఖీ లు నిర్వహించడం జరుగుతుందని, సంక్రాంతి పండుగ తర్వాత చైనా మంజా వ్యర్దాల వల్ల పక్షులతోపాటు  మనుషులకు హాని కలుగుతోందని  తెలిపారు. చైనా మాంజా అమ్మినా, నిలువ, రవాణా చేసినా ఐదేళ్లు జైలు శిక్ష, జరిమానా ఉంటుందని దుకాణం యాజమానులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏసీపీ  హెచ్చరించారు.