calender_icon.png 23 December, 2024 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. న్యాయమే గెలిచింది

13-09-2024 11:39:51 AM

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం కోర్టు తీర్పుపై ఆప్ నేత మనీష్ సిసోడియా స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఇవాళ న్యాయే గెలిచింది.. ప్రజాసేవలో ఉన్న సీఎంను జైలులో పెట్టారని సిసోడియా ఆరోపించారు. రాజ్యాంగం, అంబేద్కర్ కు ధన్యవాదాలు చెబుతున్నామని  సిసోడియా పేర్కొన్నారు.  ఎంత ఇబ్బంది పెట్టినా ఆప్ నేతలు ధైర్యంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. కేజ్రీవాల్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ సిసోడియా ధన్యవాదాలు చెప్పారు. సీఎం కేజ్రీవాల్ ప్రస్తుత తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్‌ వచ్చింది.