08-03-2025 11:40:31 PM
ఒకరు మృతి, 27 మంది భద్రతా సిబ్బందికి గాయాలు...
ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. కుకీ తెగకు చెందిన కొంత మంది భద్రతా సిబ్బందితో గొడవపడ్డారు. ఇంఫాల్ రహదారిని దిగ్బందించారు. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందగా.. 27 మంది భద్రతా సిబ్బందికి గాయాలయినట్లు భద్రతా అధికారులు పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. మణిపూర్ స్థానిక రోడ్లపై ఎటువంటి ఆంక్షలు లేకుండా స్థానికులను తిరగనివ్వాలని చెప్పారు. దీన్ని అక్కడి కుకీ తెగలు వ్యతిరేఖిస్తున్నాయి.
వారు అక్కడి భద్రతా సిబ్బందితో గొడవపడగా.. భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో బస్సులు నడపగా.. కుకీ తెగ ప్రజలు వెంటనే వాటిని అడ్డుకున్నారు. రోడ్ల మీదకి వచ్చి ఫ్రీ ట్రాఫిక్ మూవ్‌మెంట్‌కు వ్యతిరేఖంగా ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో జరిగిన వేర్వేరు దాడుల్లో నిషేధిత సంస్థలకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనకారులు కనిపించిన వాహనాలకు నిప్పు పెట్టారు.