09-02-2025 08:05:19 PM
మణిపూర్,(విజయక్రాంతి): రాజకీయ సంక్షోభం మధ్య మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ఆదివారం రాజీనామా చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ అజయ్ భల్లాను బీరేన్ సింగ్ కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. సింగ్‌తో పాటు బిజెపి, ఎన్‌పిఎఫ్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బడ్జెట్ సమావేశాల సమయంలో రాజీనామా చేసిన సింగ్ గవర్నర్‌ను కలిసిన తర్వాత సెక్రటేరియట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా బీరేన్ సింగ్ మాట్లాడుతూ... మణిపూర్ ప్రజలకు సేవ చేయడం గౌరవంగా ఉందన్నారు.
ప్రతి మణిపురి ప్రయోజనాలను కాపాడటానికి సమయ చర్యలు అందించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. మణిపూర్ అభివృద్ధి పనులు, వివిధ ప్రాజెక్టుల అమలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి బీరేన్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇకపైనా కూడా కొనసాగించాలని కోరారు. ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగిందని అధికారులు వెల్లడించారు. సింగ్ సీఎం సెక్రటేరియట్‌లో ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశానికి సంబంధించి శనివారం బీజేపీ నేతృత్వంలోని పాలక కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరాడంతోనే ఈ సమావేశం జరిగింది.