calender_icon.png 20 January, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియురాలి కుటుంబంపై ఉన్మాది దాడి

12-07-2024 02:01:55 AM

  1. ఇంటి ముందు నిద్రిస్తున్న వారిపై వేట కొడవలితో దాడి
  2. అక్కడికక్కడే భార్య.. దవాఖానకు తరలిస్తుండగా భర్త మృతి
  3. చికిత్స పొందుతున్న ప్రియురాలు, ఆమె సోదరుడు
  4. అర్ధరాత్రి ఉలిక్కిపడిన  వరంగల్ జిల్లా 16 చింతల తండా

హనుమకొండ, జూలై 11 (విజయక్రాంతి): వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉన్మాది చేతిలో దంపతులు హత్యకు గురయ్యారు. ప్రియురాలు, ఆమె సోదరుడు తీవ్ర గాయాలపాలై దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ అమానుష ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మం డలంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకా రం.. మండలంలోని 16 చింతల తం డాకు చెందిన బానోతు శ్రీనివాస్ (40)-, సుగుణ (35) దంపతులకు కూతురు దీపిక, కుమారుడు మదన్‌లాల్ ఉన్నారు. దీపిక ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. కుమారుడు మదన్ లాల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

కాగా, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ ఆటోడ్రైవర్. దీపిక, నాగరాజు ప్రేమించుకుంటు న్నారు. గత నవంబర్‌లో వీరిద్దరూ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. జనవరిలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయా రు. ఇరువర్గాలు  చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయతీ నిర్వహించారు. పెద్ద మనుషులు ఒకరి జోలికి ఒకరు వెళ్లకుండా ఉండాలని తీర్మానాలు చేశారు. అప్పటి నుంచి దీపిక కుటుం బంపై పగ పెంచుకున్న నాగరాజు.. బుధవారం అర్ధరాత్రి ఆ కుటుంబంపై తల్వార్‌తో దాడికి పాల్పడ్డాడు.

ఇంటి ముందు ఆరు బయట నిద్రిస్తున్న ప్రియురాలు తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్, సుగుణలపై వేట కొడవలితో దాడి చేశాడు. వారి అరుపులు విని ఇంటి లోపల నిద్రిస్తున్న దీపిక, ఆమె సోదరుడు మదన్‌లాల్  బయటికి వచ్చారు. నాగరాజు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. దాడిలో సుగుణ అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీనివాస్‌ను నర్సంపేట ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. దీపిక, మదన్‌లాల్‌కు తీవ్ర గాయాలు కాగా, తండావాసులు గమనించి హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

  సమాచారం అందుకున్న చె న్నారావుపేట ఎస్సై అరుణ్‌కుమార్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్లి పరిశీ లించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సభ్యులు అక్కడికి చేరుకొని ఆధారాల ను సేకరించారు. అదేవిధంగా వరంగల్ ఈ స్ట్ జోన్ డీసీపీ రవీందర్, నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్, నెక్కొండ సీఐ చంద్రమోహన్  పరిశీలించి, ఘటనపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నర్సంపేట తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. దంపతుల జంట హత్యలతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పోలీసుల అదుపులో నిందితుడు

దంపతుల దారుణ హత్యకు పాల్పడ్డ నిందితుడు మేకల నాగరాజు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది. నాగరాజు ద్విచక్ర  వాహనంపై తండాకు వచ్చాడు. ఘటనా స్థలం వద్ద అతని చెప్పులు, చేతి గడియారం, బైకును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హత్యకు ఉపయోగిం చిన వేట కొడవలిని గుండెంగ ప్రభుత్వ పాఠశాల వరండాలో వదిలి, తెల్ల వారేవరకు పాఠశాలలోనే నిద్రించాడని  గమనించిన స్థా నికులు పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిసింది.

దీంతో పోలీసులు ప్ర భుత్వ పాఠశాల వద్దకు వెళ్లి హత్యకు ఉపయోగించిన తల్వార్‌ను స్వాధీనం చేసు కొని, నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకొని నెక్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. భార్యాభర్తలిద్దరిని హత్య చేసి, ప్రియురాలు, ఆమె సో దరుడిపై హత్యాయత్నానికి పాల్పడిన నిం దితుడు మేకల నాగరాజును పోలీసులు కఠినంగా శిక్షించాలని బంధువులు, తండావాసులు డిమాండ్ చేశారు.  మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.