తెలంగాణలో ఇటీవలి కాలంలో సైకోల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. తమ ప్రేమను అంగీకరించలేదని అమ్మాయిలపైన, వారి కుటుంబసభ్యులపైన క్రూరంగా దాడులు చేసి చంపేస్తున్న దురంతాలు ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి తనకు కాకుండా పోయిందన్న పగతో అమ్మాయి కుటుంబంపై దాడి చేసి అందర్నీ చంపడానికి యత్నించిన ఉన్మాది ఘటన వెలుగులోకి వచ్చింది. క్షణికోద్రేకంతో ఇలాంటి వాళ్లు ఎంతటి ఘోరానికి పాల్పడుతున్నారో వారికైనా అర్థమవుతుందా? ఇన్ని ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఆ యువకుడికి చివరికి దక్కింది జైలు జీవితమే. కన్నవాళ్లకు కడుపు కోత మిగల్చడం తప్ప వారు సాధించేది ఏమీ ఉండదు. ప్రేమించడం తప్పు కాదు కానీ, తాము కోరుకున్న జీవితం దక్కలేదని ఇలాంటి ఘోరాలకు పాల్పడడం ఎంత మాత్రం క్షమార్హం కాదు.
నాగరాజు, నార్కట్ పల్లి