calender_icon.png 13 January, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మునగాకు ఆరోగ్యానికి మేలు

02-01-2025 12:00:00 AM

మనం నిత్యం తీసుకునే మునగాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మునగ పూలు, విత్తనం, మునగ కాయ అన్నింటిలోనూ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. గుండె వ్యాధులు, లివర్ వ్యాధులు, మధుమేహం లాంటివాటిని నయం చేస్తుంది.  మునగాకులో విటమని ఎ, విటమిన్ సి, విటమిన్ ఇతో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇందులో క్లోరోజెనిక్ యాసిడ్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే మునగాకు తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. 

ఇది మలబద్ధకం సమస్యకు మునగాకు అద్భుతంగా పరిష్కారం చూపిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. స్థూలకాయం సమస్యకు కూడా మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్ల కారణంగా ఆకలి నియంత్రణలో ఉంటుంది. 

ఫ్యాటీ లివర్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మునగాకు తీసుకోవడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య తగ్గించవచ్చు. ఇందులో ఉండే పోషకాలతో లివర్ డ్యామేజ్‌ను కాపాడవచ్చు. బ్లడ్ ప్రెషర్ నియంత్రించవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ రక్తపోటును తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పొటాషియం కారణంగా ధమనుల్లో రక్త సరఫరా మెరుగుపడుతుంది.

కొలెస్ట్రాల్ సమస్య సైతం అద్భుతంగా అదుపులోకి వస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. బ్లాకేజ్ కారణంగా తలెత్తే స్ట్రోక్, హార్ట్ ఎటాక్ సమస్యలు తగ్గుతాయి. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది డయాబెటిస్. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.