calender_icon.png 21 February, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామిడి భళా.. బత్తాయి భేష్

21-02-2025 01:00:50 AM

  1. తెలంగాణలో పెరిగిన పండ్ల సాగు విస్తీర్ణం
  2. 2023-24లో 3,06,401 ఎకరాల్లో మామిడి సాగు
  3. 58,043 ఎకరాల్లో బత్తాయి వేసిన రైతులు

మామిడి 

3,06,401 ఎకరాల్లో సాగు

12,40,368 టన్నుల దిగుబడి

టాప్ జిల్లాలు: జగిత్యాల, నాగర్‌కర్నూల్, ఖమ్మం, రంగారెడ్డి.

బత్తాయి 

    58,043 ఎకరాల్లో సాగు

    3,74,550 టన్నుల దిగుబడి 

    టాప్ జిల్లాలు: నల్లగొండ, గద్వాల, నారాయణపేట, వనపర్తి.

    హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): మండు వేసవిలో కమ్మని మామిడి తింటే ఆ మజాయే వేరు. చిన్నా.. పెద్దా అందరూ ఇష్టపడే ఫలం కాబట్టే అది పండ్లల్లో రారాజు అయ్యింది. సూర్యుడు దంచికొట్టే ఎండాకాలంలో చల్లని రసాలతో పాటు ఎన్నో పోషకాలనిచ్చే బత్తాయిని ఇష్టపడని వారూ ఉం డరు.

    ఈ క్రమంలో ఈ పండ్ల దిగుబడి లో తెలంగాణ గణనీయ ప్రగతి సాధించింది. దీంతో ఈ ఏడాది మన రాష్ట్రం లోని మార్కెట్‌లలో మామిడి, బత్తాయి పండ్లు పోటెత్తనున్నాయి. తెలంగాణ ఉద్యానశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023-24లో 3,06,401 ఎకరాల్లో మామి డి సాగు చేయగా 12,40,368 టన్నుల దిగుబడి వచ్చినట్లు తెలుస్తోంది.

    జగిత్యాల, నా గర్‌కర్నూల్, ఖమ్మం, రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మామిడి దిగుబడి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సైతం అధిక మొత్తంలో మామిడి మార్కెట్ కు పోటెత్తనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అధునాతన వ్యవసాయ పద్ధతులతోపాటు మార్కెట్ సౌలభ్యాన్ని కల్పించ డం వల్లే ఉత్పత్తి పెరిగినట్టు తెలుస్తోంది.

    తెలంగాణ బత్తాయికి గిరాకీ

    తెలంగాణలో బత్తాయి దిగుబడి సమృద్ధిగా ఉంటుంది. ఇక్కడ పండే బత్తాయిలు తియ్యగా ఉంటాయని మార్కెట్‌లో పేరుంది. దీంతో మన పండ్లకు దేశీయంగా, అంతర్జాతీయం డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏటికేడు బత్తాయి సాగు పెరుగుతోంది. 2023-24 ఉద్యానవన శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 58,043 ఎకరాల్లో బత్తాయి సాగు చేయగా, 3,74,550 టన్నుల దిగుబడి వచ్చింది.

    నల్లగొండ జిల్లాలో అత్యధికంగా బత్తాయిని పండిస్తున్నారు. ఆ తర్వాత గద్వాల జోగులాంబ, నారాయణపేట, వనపర్తిలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో బత్తాయి దిగుబడి వచ్చింది. ఈ ఏడాదిలో సైతం మార్కెట్‌లోకి అధిక మొత్తంలో బత్తాయి పండ్లు రానున్నాయి.  

    దిగుబడి పెరగడానికి కారణాలు..

    * మెరుగైన నీటిపారుదల 

    * రైతులకు సబ్సిడీలు

    * పరిశోధనతో ఉత్తమ పద్ధతులను అవలంబించడం

    * అధిక దిగుబడినిచ్చే రకాల సాగు 

    * సాగుదారులు, వ్యాపారులకు మార్కెట్ అవకాశాల కల్పన