calender_icon.png 25 November, 2024 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంగ్లీకి బిస్మిల్లా ఖాన్ అవార్డు

25-11-2024 12:00:00 AM

సత్యవతి చౌహాన్ అలియాస్ మంగ్లీ. తెలుగు వారికి మంగ్లీగా సుపరిచితురాలై, గాయనిగా బాగా పాపులర్ అయ్యింది.. తన ప్రత్యేకమైన గొంతుతో అందరిని ఆకట్టుకుంటోంది. ముందు ప్రైవేట్ సాంగ్స్‌తో కెరీర్ మొదలుపెట్టిన మంగ్లీ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తోంది. ఫోక్, డివోషనల్, ఐటెం సాంగ్స్‌కు ఆమె పెట్టింది పేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి పాటలో తన మార్క్ చూపిస్తోంది.

‘జార్జిరెడ్డి’ మూవీలోని ‘రాయల్ ఎన్ఫీల్డ్’ గీతం ఆమెకు మంచి పేరు తెచ్చింది. ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో ‘రాములో రాములా..’, ‘లవ్‌స్టోరీ’లోని ‘సారంగదరియా’ వంటి అనేక గీతాలకు మంచి స్పందన వచ్చింది. ఆమెతో పాడించిన ఏ పాటైనా సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది.

ఇలా సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గుర్తింపుగా ఇటీవలే సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ యువ పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డును మంగ్లీ ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అందుకున్నారు.