calender_icon.png 15 March, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంగపతి క్యారెక్టర్.. నా ఇరవైఐదేళ్ల కల

15-03-2025 12:04:06 AM

నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో వచ్చిన మూవీ ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ సినిమా మార్చి 14న విడుదలైంది. ఈ నేపథ్యంలో చిత్రంలో మంగపతి పాత్ర పోషించిన యాక్టర్ శివాజీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. “బిగ్ బాస్ షో.. నేనేంటనేది ప్రపంచానికి తెలిపింది.

అదే సమయంలో నేను నటించిన ‘90స్’ వెబ్ సిరిస్ కూడా హిట్ అయ్యింది. దాని తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. దాదాపు ఎనభై కథలు విన్నా. చాలా వరకూ ఫాదర్ రోల్స్. చాలా వరకూ రిజెక్ట్ చేశాను. ‘కోర్ట్’లో చేసిన మంగపతి క్యారెక్టర్ నా 25 ఏళ్ల కల.  హీరో నాని ద్వారా ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నా కోసం ఇలాంటి క్యారెక్టర్ పుట్టిందని భావిస్తున్నా.

డైరెక్టర్ రియల్ లైఫ్ నుంచి ఈ క్యారెక్టర్ తీసుకున్నాడని భావిస్తున్నా.  ఈ క్యారెక్టర్‌ను డైరెక్టర్ నెక్స్ లెవల్‌లో రాసుకున్నాడు. ప్రతి పాత్రనూ శిల్పంలా చెక్కాడు. ఎస్వీ రంగారావు, గుమ్మడి, జగ్గయ్య, రాజనాల మరపు రాని పాత్రలు చేశారు. అలాంటి పాత్రలు చేయాలని నాకు ఉండేది. హీరోగా స్టిక్ అవ్వాలనే ఆలోచన నాకూ ఎప్పుడూ లేదు. జల్సా, ఒట్టేసి చెబుతున్నా, మనసుంటే చాలు సినిమాల్లోని పాత్రలు అలా చేసినవే.

మంగపతి పాత్రలో సహజమైన భావోద్వే గం ఉంది. ప్రతి కుటుంబంలో అలాంటి ప్రోటక్టివ్ నేచర్ ఉన్న వ్యక్తి ఉంటాడు. అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలానే బిహేవ్ చేస్తాడు. మంగపతిగా నేను.. యానిమల్‌లో బాబీ డియోల్ కంటే బాగా చేశాన ని ఒకరు రివ్యూ రాశారు. అది చాలా హ్యాపీ గా అనిపించింది. నాని నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు.

కొత్త వారిని ప్రోత్సాహించడంలో గొప్ప చొరవ చూపిస్తున్నారు.  వాల్ పోస్టర్ సినిమా.. సూపర్ గుడ్ ఫిలిమ్స్, సురేశ్ ప్రొడక్షన్, ఉషా కిరణ్ లాంటి బ్యానర్ అవుతుంది. మంగపతి తరహాలో మెడికల్ షాప్ మూర్తి అనే ఓ క్యారెక్టర్ విన్నాను. త్వరలోనే వాళ్లు అనౌన్స్ చేస్తారు. ఈ సినిమా తర్వాత లయ, నేను కలిసి ఓ సినిమా చేస్తున్నాం. ఇంకా ‘దండోరా’ అనే సినిమా చేస్తున్నా. ‘90స్’కి సీక్వెల్ కూడా ఉంది” అని శివాజీ చెప్పుకొచ్చారు.