calender_icon.png 11 January, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంగళ్‌యాన్‌కు 11 ఏళ్లు పూర్తి

06-11-2024 01:28:50 AM

రెండో మిషన్ కోసం

ఇస్రో సన్నాహాలు

న్యూఢిల్లీ, నవంబర్ 5: సరిగ్గా 11 ఏళ్ల క్రితం అంతరిక్షరంగంలో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ మొత్తంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళ్‌యాన్ పేరుతో అంగారకుడిపైకి మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)ను ప్రయోగించింది. 2013 నవంబర్ 5న భూమి నుంచి బయలుదేరిన అంతరిక్షనౌక దాదాపు 300 రోజులు ప్రయాణించి 2014 సెప్టెంబర్ 14న అంగారకుడి కక్ష్యలోకి చేరింది.

దీంతో మొదటి ప్రయత్నంలో అంగారకుడిని చేరిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచి, ప్రపంచ దేశాలకు మన సత్తా ఏంటో చూపించింది. అంతేకాకుండా అరుణగ్రహాన్ని చేరిన నాలుగోదేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. మంగళ్‌యాన్ ప్రయోగం కోసం భారతదేశం 72 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ఇంత తక్కువ మొత్తంలో ఏ దేశం కూడా ఇప్పటి వరకు ఇలాంటి ప్రయోగాన్ని చేసి, విజయం సాధించలేదు.

ఈ ప్రయోగంలో భాగంగా శాస్త్రవేత్తలు అంగారకుడి వాతావరణం, ఉపరితలం, అక్కడ లభించే ఖనిజాలు తదితర అంశాలను అధ్యయనం చేశారు. ఏడేళ్లపాటు నిర్విరామంగా అంగారకుడికి సంబంధించిన సమాచారాన్ని మంగ ళ్‌యాన్ అందించింది. ఈ ప్రయోగాన్ని ప్రేరణగా తీసుకుని ఇస్రో మంగళ్‌యాన్ కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.