అమరావతి,(విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి బుధవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2021 అక్టోబర్ 19న వైసీపీ పార్టీకి చెందిన కొందరు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసి ఫర్మిచర్, కార్లు, అద్దాలు ధ్వంసం చేసి వీరంగం సృష్ట్రించారు. ఈ ఘటనపై పలువురు వైసీపీ నేతలను పోలీసులు విచారించగా.. ఈ కేసులో సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో కీలక నింధింతుడైన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సన్నిహితుడు చైతన్య సోమవారం మంగళగిరి కోర్టులో లొంగిపోయాడు.