calender_icon.png 21 December, 2024 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమ్మయ్యా.. మానేరు నిండింది!

13-09-2024 02:11:11 AM

  1. ఎట్టకేలకు లోయర్ మానేరుకు జలకళ 
  2. ఆయకట్టు అన్నదాతల ఆనందహేళ

కరీంనగర్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): కరీంనగర్ పరిధిలోని దిగువ మానేరు జలాశం (ఎల్‌ఎండి) పూర్తిస్థాయిలో నిండింది. గత ఆగస్టు చివరి నాటికి కేవలం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా, ఎల్‌ఎండీకి నీరు వస్తుందో, లేదోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. కరీంనగర్ నగరానికి తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిం ది. సెప్టెంబర్ ఆరంభం నుంచి వర్షాలు ఆశాజనకంగా కురవడంతో ఎస్సారెస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వరద నీరు మిడ్‌మానేరుకు రావడం, మిడ్ మానేరు గేట్లు ఎత్తడం ద్వారా ఎల్‌ఎండీకి నీటి ప్రవహం పెరగింది.

వర్షాలతో మోయతుమ్మెద నుంచి కూడా భారీ ప్రవాహం రావడంతో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. ఎల్‌ఎండీ పూర్తిస్థాయి సామర్థ్యం 920 అడుగులకు గురువారం మధ్యాహ్నం వరకు 919.75 అడుగులకు నీరుచేరుకుంది. 24.034 టీఎంసీల సామర్థ్యానికిగాను 23.818 టీఎంసీ లకు చేరుకుంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1304 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 309 క్యూసెక్కులుగా నమోదవుతుంది. ప్రవాహం తగ్గడం తో డ్యాంలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నా గేట్లు తెరవలేదు. ఇన్‌ఫ్లో 10 వేల క్యూసెక్కులపైన ఉంటే గేట్లు తెరిచే అవకాశం ఉంది. 

పూజలు చేసిన సుడా చైర్మన్ 

ఎల్‌ఎండీలో పూర్తిస్థాయి నీటిమట్టానికి నీరు చేరుకోవడంతో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి డ్యాంను సందర్శించి నీటికి పూజలు చేశారు. గత కాంగ్రె స్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన శ్రీపా ద ఎల్లంపల్లి ప్రాజెక్టు, వరద కాలువ వల్లనే మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాం నిండాయని స్పష్టం చేశారు. యా సంగికి నీటి కొరత లేకుండా ప్రభుత్వం నీటి విడుదలను క్రమపద్ధతిలో చేపట్టనుందని తెలిపారు.