calender_icon.png 8 January, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ స్తంభం ఎక్కి మందుబాబు హల్‌చల్

02-01-2025 02:45:50 AM

ఏపీలోని పార్వతీపురం జిల్లాలో ఘటన

అమరావతి, జనవరి 1: ఓ మందుబాబు పూటుగా మద్యం తాగి విద్యుత్ స్తంభం ఎక్కి హల్‌చల్ సృష్టించాడు. ఈ ఘటన బుధవారం ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగపురంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన వెంకన్న పట్టపగలే మద్యం తాగాడు.

దీంతో కుటుంబ సభ్యులు వెంకన్నను తిట్టారో ఏమో తెలియదు గానీ.. ఆ మందుబాబు వెంటనే గ్రామంలోని ఓ డాబా ఎక్కాడు. అక్కడి నుంచి విద్యుత్ స్తంభం ఎక్కి కూర్చున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది పవర్ నిలిపివేశారు.

ఇక మందుబాబు విద్యుత్ తీగలపై అడ్డంగా పడుకున్నాడు. కింద ఉన్న కుటుంబ సభ్యులను దూషిస్తున్నాడు. దీంతో గ్రామస్తులు మందుబాబుకు నచ్చజెప్పి కింది దిగేలా చేశారు. దేహశుద్ధి చేసి ఇంటికి పంపించారు.