calender_icon.png 2 October, 2024 | 6:02 AM

మందిరమైనా, మసీదైనా తొలగించాల్సిందే

02-10-2024 03:06:30 AM

ఆక్రమణలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

మత విశ్వాసాల కంటే ప్రజా భద్రతే ముఖ్యమని వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ప్రార్థనా మందిరాలు ప్రజా జీవితానికి అడ్డంకిగా మారకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అక్రమ నిర్మాణాల తొలగింపు విషయమై దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పు నిచ్చింది.

రోడ్లు, జలాశయాలు, రైలు ట్రాక్‌లను ఆక్రమించిన ఏ మత సంబంధ కట్టడాలైనా తొలగించాల్సిందేనని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి ఇళ్లు, స్థలాల్లో.. బుల్డోజర్ చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ లౌకిక దేశమని.. మతాలతో సంబంధం లేకుండా ఆక్రమణల తొలగింపు, బుల్డోజర్ చర్యలు అందరికీ ఒక్కటేనని స్పష్టం చేసింది. మున్సిపల్, కార్పొరేషన్లు, పంచాయతీలకు వేర్వేరు చట్టాలు ఉన్నాయని.. అయితే వీటికి ఆన్‌లైన్ పోర్టల్ కూడా ఉండాలని.. ఈ పోర్టల్‌లో రికార్డులన్నిటినీ డిజిటలైజ్ చేసి ఉంచడం వలన ప్రజలు అన్నీ తెలుసుకోగలరని వెల్లడించింది. 

భారత్ సెక్యులర్ దేశం..

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యలపై న్యాయస్థానం స్పందిస్తూ.. ‘భారత్ సెక్కులర్ దేశం. మా మార్గదర్శకాలు మతం, జాతి, వర్గాలకు అతీతంగా ఉంటా యి. అందరికీ వర్తిస్తాయి. ఆక్రమణల విషయానికి వస్తే.. రోడ్డు, ఫుట్‌పాత్, జలాశ యాలు, రైలు పట్టాలపై ఏదైనా మత సం బంధమైన నిర్మాణం ఉంటే అది గుడి, మసీదు, దర్గా, గురుద్వారా, చర్చి ఏదైనా.. తొలగించాల్సిందే అని స్పష్టం చేశారు.

ఇక యూన్ రిపోర్టర్ సీనియర్ న్యాయవాది వింద్రా గ్రోవర్ ఇళ్ల లభ్యతపై వాదనలు వినిపించగా.. దీనికి సొలిసిటర్ జనరల్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఈ విషయాన్ని అంతర్జాతీయకరించాల్సిన అవసరం లేదని.. మన రాజ్యాంగం, దేశ న్యాయస్థానాలకు తగినంత శక్తి ఉందన్నారు.

ఈ విషయంలో అంతర్జాతీయ ఏజెన్సీ జోక్యం అవసరం లేదు’ అని ఆయన తెలిపారు. కూల్చివేతలకు ఆరోపణలు మాత్రమే ఆధారం కాకూడదని, పౌర నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో మాత్రమే, అదికూడా కోర్టు అనుమతి తీసుకొని కూల్చివేతలు జరపవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు కూల్చివేతలపై గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.

చట్టాన్ని అతిక్రమిస్తేనే చర్యలు..

గుజరాత్, యూపీ, ఎంపీ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరవ్వగా.. క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉండటమే బుల్డోజర్ చర్యను ఎదుర్కోడానికి కారణమా అని ధర్మాసనం ఆయన్ను ప్రశ్నించింది.  తుషార్ మెహతా స్పందిస్తూ.. ‘ఖచ్చితంగా కాడు.. అత్యాచా రం, ఉగ్రవాదం వంటి నేరాల్లో నిందితులైనా సంబంధం లేదు.

ఒకరోజు ముందు నోటీసు జారీచేసి ఇంటిగోడపై అంటించి నా పరిగణలోకి తీసుకోం. ముందే చట్టాన్ని అతిక్రమించి ఉంటేనే చర్యలు తీసుకుం టాం’ అని తెలిపారు. అలాగే ఒకటి, రెండు సంఘటనల ఆధారంగా న్యాయస్థానం ఓ అంచనాకు రావద్దని కోరారు. ఒక వర్గానికి సంబంధించిన కొన్ని ఉదంతాల ఆధారం గా కోర్టు ఆదేశాలు జారీచేయడంపై తాము ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు.