మంథని,(విజయక్రాంతి): మంథని యాదవ సంఘం మండల అధ్యక్షుని గా ఆదివారం నూతనంగా ఎన్నికైన పర్షవేన మోహన్ యాదవ్ ను సోమవారం ఉదయం మంథని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మోహన్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాసురేష్ రెడ్డి, మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, నాయకులు అజీంఖాన్, కుడుదుల వెంకన్న, ఎరుకల ప్రవీణ్, పాపారావు, నక్క శంకర్, శ్రీనివాస్, ఓదెల, రాము తదితరులు పాల్గొన్నారు.