ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రెండో ర్యాంకుకు ఎగబాకింది. మంగళవా రం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున మంధాన (738 పాయింట్లు) మా త్రమే టాప్ చోటు దక్కించుకోవడం గమనార్హం.
ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ లో ఒక సెంచరీ (135) సహా 71, 43 పరుగులు సాధించింది. ఇక తొలి స్థానంలో సౌతాఫ్రికా బ్యాటర్ లారా వోల్వర్ట్ (773 పాయింట్లు) ఉండగా.. మంధాన రెండులో, లంక బ్యాటర్ చమేరీ ఆటపట్టు (733 పాయింట్లు) మూడో స్థానంలో కొనసాగుతోంది.
బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి దీప్తి శర్మ (680 పాయింట్లు) ఒక స్థానం ఎగబాకి 4వ స్థానంలో నిలవగా.. సోఫీ ఎసెల్‌స్టోన్ అగ్రస్థానంలో ఉంది. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ దీప్తి శర్మ ఆరో స్థానాన్ని కాపాడుకుంది.