- వెస్టిండీస్‌పై భారీ విజయం
- 2 సిరీస్ భారత్ సొంతం
- 217 - మహిళల టీ20 చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఆసియా కప్‌లో యూఏఈపై సాధించిన 201 పరుగులు ఉత్తమం.
763 - ఈ ఏడాది టీ20ల్లో మంధాన సాధించిన పరుగులు. లంక కెప్టెన్ ఆటపట్టును దాటి తొలి స్థానం.
ముంబై: స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు 2 సొంతం చేసుకుంది. గురువారం ముంబై వేదికగా జరిగిన మూ డో టీ20లో టీమిండియా 60 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
మంధాన క్లాస్ ఇన్నింగ్స్‌కు తోడు రిచా మాస్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టడంతో భారత్ సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికె ట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. మం ధాన (47 బంతుల్లో 77), రిచా ఘోష్ (21 బంతుల్లో 54) అర్థశతకాలతో రాణించారు.
21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన రిచా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ జాబితాలో సోఫీ డివైన్, ఫోబే లిచ్‌ఫీల్డ్ సరసన చేరిం ది. రాఘవి బిస్త్ (31 నాటౌట్) ఆకట్టుకుంది. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిం డీస్ 19.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులకు పరిమితమైంది. భారీ లక్ష్యం కావడంతో ఛేదనలో వెస్టిండీస్ ఒత్తిడికి గురైంది. చినెల్లె హెన్రీ (43) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 4 వికెట్లతో రాణించింది.