న్యూఢిల్లీ: భారత ప్రొఫెషనల్ బాక్సర్ మన్దీప్ జంగ్రా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. కేమన్ ఐలాండ్ వేదికగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ టోర్నీలో బ్రిటన్ బాక్సర్‌ను చిత్తు చేసిన మన్దీప్ డబ్ల్యూబీఎఫ్ సూపర్ ఫెదర్వెయిట్ ప్రపంచ టైటిల్‌తో మెరిశాడు. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపించిన మన్దీప్ ఆఖరి రౌండ్ వరకు అదే జోరును కొనసాగించాడు. చివరి రౌండ్లో బ్రిటన్ బాక్సర్ కొనార్ మెకింతోష్ను ఓడించి టైటిల్ ఒడిసి పట్టాడు. ప్రొఫెషనల్ బాక్సర్ అవతారం ఎత్తిన మన్దీప్ తన కెరీర్లో 12 ఫైట్స్‌లో పాల్గొని పదకొండు గెలవడం విశేషం. ఇందులో ఏడుసార్లు నాకౌట్ విజయాలు ఉన్నాయి. హరియాణాకు చెందిన మన్దీప్ ఒలింపిక్స్ రజత పతక విజేత రాయ్ జోన్స్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.