calender_icon.png 15 January, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందా మృతి తెలంగాణకు తీరనిలోటు

14-01-2025 12:58:24 AM

బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు వనం రాములు యాదవ్

పెబ్బేరు, జనవరి 13: నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యులు మందా జగన్నాథం అకాల మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు వనం రాములు యాదవ్ అన్నారు. పెబ్బేరు మున్సిపాలిటీలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎనలేని కషి చేశారన్నారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, కౌన్సిలర్ గోపి బాబు, నాయకులు విశ్వరూపం, మేకల ఎల్లయ్య, వెంకటేష్, రాజశేఖర్, సాయినాథ్, వడ్డె రమేష్, బాలస్వామి, సందీప్, వెంకటయ్య, సురేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.