calender_icon.png 3 April, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ స్త్రీనిధి అవార్డును అందుకున్న మందమరి మున్సిపాలిటీ

02-04-2025 08:40:03 PM

అభినందించిన డిఆర్డిఏ కిషన్..

మందమర్రి (విజయక్రాంతి): 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను స్త్రీనిధి రుణాలు లక్ష్యాలను సాధించినందుకు అలాగే తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించినందుకు గాను మందమర్రి మున్సిపాలిటీకి ఉత్తమ స్త్రీనిధి అవార్డుకు ఎంపికయింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సమాఖ్య కార్యాలయంలో జిల్లా డిఆర్డిఏ కిషన్ టిఎంసి రఘురాం, పట్టణ సమాఖ్య ప్రతినిధులు సంధ్య, రాధ లకు అవార్డులు అందజేసి వారిని అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలలో మందమర్రి మున్సిపాలిటీ స్త్రీనిధి ఉత్తమ అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మెప్మాలో ఆర్పిల పనితీరు బాగుందని కొనియాడారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలను అన్నిరంగాల్లో ముందుకు రాణించేలా వారికి రుణాలు అందచేసి స్వయం ఉపాధి కల్పించేలా ప్రోత్సహిం చాలని కోరారు. ఇందిరా మహిళా శక్తి లక్ష్యాలను సాధించాలని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి సాధించడంలో అందరూ పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్త్రీనిధి రీజినల్ మేనేజర్ వెంకట రమణ, సంస్థాగత నిపుణురాలు స్వర్ణలత, ఏటీఎం లు జిల్లా సమాఖ్య పదాధికారులు పాల్గొన్నారు.